విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారం లా నిలబడేది.. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు.. ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి ఆవిడ కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది.. 1955 వ సంవత్సరం లో జరిగిన యాదర్థ సంఘటన ఇది.. విజయవాడ లో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారి భక్తుడు.. కాయ కష్టం మీదే బతికేవాడు.. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదల అయ్యింది.. ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమాహాల్ దగ్గర ఉండేవాడు ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకునీ వెళ్ళటానికి.. అలా ఉండగా ఒక రోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతీ టాకీస్ సినిమాహాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండీ ఒక పెద్దావిడ ఎర్రటి చీర నుదుటున పెద్ద బొట్టు తో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది.. అక్కడ నుండి ఆయన రిక్షా లో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయమైంది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా నీకు భయమేయట్లేదా అంటే దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న ఆవిడ మా తల్లీ అమ్మ.. తల్లి దగ్గర బిడ్డలకి భయమెందుకు అంటాడు.. కొంత దూరం వెళ్లగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలి అమ్మ అనగా వెనక నుండి సమాదానం లేదు అదేంటీ అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో అదేంటీ అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది అదేంటీ అమ్మ డబ్బులు ఇవ్వలేదు అనగా నీ తలపాగా లో పెట్టాను చూడు అంటుంది.. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు ఒక పక్క, పదిరూపాయల నోటు మరో పక్క ఉన్నాయి. వెంటనే ఆయనకి అర్ధమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్నఅమ్మ అని.. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలెడతాడు.. చుట్టు పక్కల ఉన్న వాళ్ళు అందరు పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడుగగా వారికీ జరిగింది చెప్తే బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకి వచ్చింది అమ్మవారే అని అర్ధమవుతుంది... ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు..
తద్దినాలు పెట్టడము అవసరమా తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని క...
🌸పరోపకారం గురించి ఒక చిన్న కథ🌸 అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ... ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా? అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ. శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ...